![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ ' ఎటో వెళ్ళిపోయింది మనసు'(Eto Vellipoyindhi Manasu). ఈ సీరియల్ మంగళవారం నాటి ఎపిసోడ్ -367 లో... రామలక్ష్మిని తన పుట్టింటికి తీసుకొని వస్తాడు సీతాకాంత్. అక్కడ రామలక్ష్మిని సుజాత, మాణిక్యం చూసి షాక్ అవుతారు. నా కూతురు బ్రతికే ఉందని మాణిక్యం హ్యాపీగా ఫీల్ అవుతుంటే.. నేను మీ కూతురిని కాదు నా పేరు మైథిలీ అని చెప్తుంది. అయిన మాణిక్యం సుజాత వినిపించుకోకుండా రామలక్ష్మి అంటుంటారు.
నువ్వు కూడా తను రామలక్ష్మి కాదని నమ్ముతున్నావా అని సీతాకాంత్ తో మాణిక్యం అంటాడు. తను రామలక్ష్మి అని మనసుకి తెలుసు కానీ తనే వినిపించుకోవడం లేదని సీతాకాంత్ అంటాడు. ఈ రోజు వాళ్ళ పెళ్లి రోజు వాళ్ళని బాధపెట్టకండి అని సీతాకాంత్ తన అత్తమామలకి బట్టలు తీసుకొని వచ్చి రామలక్ష్మి చేతుల మీదుగా వాళ్ళకి ఇప్పిస్తాడు. వెళ్లి మార్చుకోండి అని వాళ్ళను పంపిస్తాడు. మరొక వైపు రామ్ గేమ్ ఆడుతుంటాడు. ఎప్పుడు గేమేనా అంటూ శ్రీలత కోప్పడుతుంది. నేనంటే ఎందుకు ఇష్టం లేదని చెప్పావ్.. నీకు ఏం చేస్తే నచ్చుతానని రామ్ తో రమ్య అంటాడు. నువ్వు సీతా పక్కన సెట్ కావని రామ్ కోపంగా అక్కడ నుండి వెళ్ళిపోతాడు. సీతాకి నీకు పెళ్లి ఎలా చెయ్యాలో తెలుసు.. ఎవరు చెప్తే వింటాడో కూడా తెలుసని శ్రీలత అంటుంది.
సుజాత, మాణిక్యం ఇద్దరు కొత్త బట్టలు వేసుకొని వస్తారు. కేక్ కట్ చేస్తారు. ఆ తర్వాత రామలక్ష్మికి జ్యూస్ ఇవ్వబోతుంటే రామలక్ష్మిపై పడుతుంది. దాంతో నా కూతురు గదిలో డ్రెస్ ఉంది మార్చుకోమని సుజాత చెప్తుంది. సుజాతని ఎవరో పిలస్తే బయటకు వెళ్తుంది. రామలక్ష్మి గదిలోకి వెళ్లి బీరువా తాళం తీసి డ్రెస్ మార్చుకుంటుంది. రామలక్ష్మి డ్రెస్ వేసుకొని బయటకు రాగానే.. అదేంటీ గదిలో ఉన్నాయని చెప్పాను.. బీరువా తాళం ఎక్కడ ఉందో చెప్పలేదు కదా అని సుజాత అంటుంది. అయ్యో పొరపాటుగా తీసేసానంటూ బీరువా తాళం దానికే ఉందని రామలక్ష్మి కవర్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |